కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు

*కష్టపడి చదివితేనే బంగారు భవిష్యత్తు* *విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి –* *ఆర్డీవో సోమిరెడ్డి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నవంబర్ 27 (ప్రజావాణి): మంచాల కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీవో సోమిరెడ్డి అన్నారు. బుధవారం మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.50 వేల విలువైన పిండి కలిపే యంత్రంతో పాటు విద్యార్థులు వినియోగించుకునేందుకు టబ్బులు, జగ్‌లు, గ్రంథాలయానికి పుస్తకాలను...