జర్నలిస్టుల స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.పత్రికా స్వేచ్ఛకు, శాంతిభద్రతలకు మధ్య సమతుల్యత అవసరమన్న ధర్మాసనం.
ఢిల్లీ సుప్రీంకోర్టు నవంబర్ 27
జర్నలిస్టుల స్వేచ్ఛ, భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టుల హక్కులను కాపాడటంతో పాటు శాంతిభద్రతలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీలో నిరసనలను కవర్ చేస్తున్న ఏడుగురు కేరళ జర్నలిస్టులు పోలీసుల వేధింపులు, దాడులు, అక్రమ నిర్బంధానికి గురయ్యారన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. ఈ కేసును మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది.
గుర్తింపు పొందిన జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ ఉండాలా? జర్నలిస్టులుగా పనిచేసే వారికి ఎలాంటి భద్రత కల్పించాలి? అనే అంశాలను కూడా పరిశీలించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలకం.. జర్నలిస్టుల భద్రతపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
>> ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో Y. బాల గురవయ్య.

