📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందించే నాకప్ కాంట్రాక్టు సంస్థ ను...

సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందించే నాకప్ కాంట్రాక్టు సంస్థ ను రద్దు చేయాలి

📰 Generate e-Paper Clip

సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నాసిరకమైన సరుకులు అందించే నాకప్ కాంట్రాక్టు సంస్థ ను రద్దు చేయాలి.SFIడిమాండ్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 27

*-ఇందిరమ్మ రాజ్యం లో వసతి గృహ ల్లోపేద మధ్యతరగతి విద్యార్థుల బుక్కెడు బువ్వ కు FRSనా* ప్రభుత్వానికి సిగ్గువుండాలి.

*-SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్*

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అడవిదేవులపల్లి మండల కమిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆఫీసు సిబ్బందికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సైదా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత SC,ST,BC సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు అందించే సరుకులు పంపిణీ కి సెంట్రలేజేషన్ పేరుతో నాకప్ కాంట్రాక్టు సంస్థ అపజేప్పి పేద మధ్యతరగతి విద్యార్థుల కడుపు కోడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు.ఈ సంస్థ వాళ్ళు బహిరంగ మార్కెట్లో దొరికే నిత్యావసర వస్తువుల ధరల కు నాకప్ కాంట్రాక్టు సంస్థ రేటులకు చాలా వ్యత్యాసం ఉంది . రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం పేద మధ్యతరగతి విద్యార్థుల కడుపులు నింపడానికా, కాంట్రాక్టు సంస్థ ల జేబులు నింపడానికా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రులు విద్యార్థుల కు అన్యాయం జరుగుతుంటే మొద్దు నిద్ర లో మునుగుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించలేని మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థుల కు వారానికి 5గుడ్లు, 5అరటిపండ్లు సాయంత్రం బిస్కేట్స్ స్నాక్స్ ఇస్తారు .కాని ఈ నాకప్ కాంట్రాక్టు సంస్థ పంపే సర్కుల ధరలతో విద్యార్థులకు కనీసం వారానికి ఒక్క కోడి గుడ్డు, ఒక్కసారి చికెన్ రాదు,పాలు గుడ్లు కోత పేడితే విద్యార్థులు ఏవిధంగా ఆరోగ్యం గా వుంటారని ప్రశ్నించారు. SC, ST, BC సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లో పేద మధ్యతరగతి విద్యార్థుల కు బుక్కెడు బువ్వ పెట్టడానికి FRSపెట్టడం ముఖ్యమంత్రి పిచ్చుకల పై బ్రహ్మస్త్రం ప్రయోగించినట్లేనని అన్నారు.నాకప్ సంస్థ ద్వారా పంపిణీ చేసే సరుకులు నాసిరకం గా పంపిణి చేస్తే వసతి గృహ అధికారి వార్డెన్ లు చేతి నుంచి డబ్బులు పెట్టి కోనలేక విద్యార్థుల ను అర్ధాకలితో వుంచలేక వార్డెన్ లు నానా అవస్థలు పడుతున్నారు . గ్రామీణ ప్రాంతాల నుండి తండాల నుంచి గూడాలనుంచి ఉన్నత విద్య కోసం వచ్చిన వసతి గృహ విద్యార్థుల పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భవిష్యతులో సెంట్రలేజేషన్ ను FRSను రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా SC,ST,BCవిద్యార్థులను కూడా గట్టీ బలమైన సమరశీల పోరాటాలకు పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ కుమార్ బబ్లూ కిరణ్ పవన్ కళ్యాణ్ మమత రవి సూర్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.