జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన సంవిధాన్ రక్షా యాత్రకు నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లారు. ఈ యాత్రలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ యాత్ర కొనసాగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఇంచార్జి బి.ఎం. సందీప్, రాష్ట్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

