సంవిధాన్ రక్షా యాత్రలో పాల్గొన్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన సంవిధాన్ రక్షా యాత్రకు నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లారు. ఈ యాత్రలో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని లిబర్టీ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ యాత్ర...