📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఉపాధ్యాయవిద్యా రంగ సమస్యలు పరిష్కరించాలిపిఆర్సీ అమలు చేయాలి

ఉపాధ్యాయవిద్యా రంగ సమస్యలు పరిష్కరించాలిపిఆర్సీ అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయవిద్యా రంగ సమస్యలు పరిష్కరించాలిపిఆర్సీ అమలు చేయాలి

* డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి

* జమ్మికుంటలోడిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం

* డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి అధ్యక్షతన

జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి)

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి మొదటి పిఆర్సి గడువు ముగిసి 40నెలలు కావస్తున్నప్పటికీ, రెండో పి ఆర్ సి ని అమలు చేయడం లేదని, వెంటనే పిఆర్సి కమిషన్ నుండి రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుజమ్మికుంటలో డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి అధ్యక్షతన జరిగిందిఈ సమావేశానికి హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డిమాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నేటికీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, నేటికీ ఇట్టి విషయమై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని పెండింగ్ లో ఉన్న కోట్లాది రూపాయల రెగ్యులర్ ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ఆర్థిక బిల్లులు వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల అమలును పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ట్రప్రభుత్వాన్నికోరారుఅదేవిధంగాఉపాధ్యాయుల రేషనేలైజేషన్ కు సంబంధించిన జీవో 25 అశాస్త్రీయంగా ఉన్నదని పాఠశాల కేంద్రంగా విద్యార్థుల,తరగతుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలన్నారు పాఠశాల విద్యారంగంలో రోజురోజుకు స్వచ్ఛంద సంస్థ జోక్యం,కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయని, తద్వారా ఉపాధ్యాయులు తరగతి గదికి దూరంచేయబడుతున్నారన్నారుడిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల తిరుపతి మాట్లాడుతూ పాఠశాల విద్యలో ఇంటర్ విద్య విలీనం చేస్తూ సీనియర్ సెకండరీ విద్య గా అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డిటిఎఫ్ స్వాగతిస్తున్నదని అయితే
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం ద్వారా ప్రిన్సిపాల్ లులెక్చరర్లు
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుసెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు పిజిటీలు,టిజిటీలు తదితర ఉద్యోగుల మధ్య తలెత్తే సర్వీస్ సంబంధ సమస్యలు, బోధనా అర్హతలు, అధికారాల విభజన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జూనియర్ కళాశాల నిర్వహణ తదితర విషయాలలో తలెత్తే సమస్యలు అన్నింటినీ కులంకుశంగా సంబంధిత సంఘాలు, మేధావులు నిపుణులతో చర్చించిన తర్వాతనే విలీన ప్రక్రియ చేపట్టాలని అన్నారుడిటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎం.రఘు శంకర్ రెడ్డిమాట్లాడుతూ విద్యా రంగ ప్రైవేటీకరణ,కార్పోరేటీకరణ
ప్రజల మధ్య తీవ్ర అసమానతలు పెంచుతున్నదని ,ప్రస్తుత కాలంలో శృతి మించిన విద్యా ప్రైవేటీకరణ వల్ల దైనందిన జీవితంలో తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించాల్సి వస్తున్నదని పేదప్రజలకు పెనుభారం అవుతున్నదని దీనికి కామన్ స్కూల్ విధానమే సరైన పరిష్కారమని అన్నారుడిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెజారిటీ మండలాలు, జిల్లాలు ఇన్చార్జి విద్యాధికారులతో నడుస్తున్నాయనివారి స్థానాలలో రెగ్యులర్ మండల విద్యాధికారులను ఉపవిద్యాధికారులను జిల్లా విద్యాశాఖాధికారులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారుఈ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తూముల తిరుపతి ,రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె.నారాయణరెడ్డి , ఎం. రఘుశంకర్ రెడ్డి, డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవాల నరహరి ,చకినాల రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు ఏ. దామోదర్, తాళ్ళపెల్లి తిరుపతి గౌడ్, బి. రమేష్, శ్రీరాం చక్రధర్, యు. శంకర్, రాష్ట్ర కౌన్సిలర్స్ యం. సదానందం, ఎస్. సంపత్ పి. ఈశ్వర్ రెడ్డి, బి. తిరుపతి రెడ్డి, డి.సదానందం కె.సమ్మిరెడ్డి కె. వెంకట్‌రెడ్డి, ప్రకాష్, రత్నం హరీష్ కుమార్, వేణుమాధవ్ కె.సంపత్, సిహెచ్.వేణు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.