రాజ్యాంగంతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు
ప్రతి పౌరుడికి సమానత్వం కల్పించింది రాజ్యాంగమే : సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళి అర్పించిన సర్పంచ్
జహీరాబాద్, నవంబర్ 26 (ప్రజావాణి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్గోల్ గ్రామంలో సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లే నేడు తాను సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని అన్నారు. మనమందరం స్వేచ్ఛగా, సమాన హక్కులతో జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగమేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తోందని, అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
