📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణయాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి

యాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

యాసంగి సీజన్‌లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి

రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎ.పి.సి., ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సాగు ప్రణాళికలో భాగంగా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ, వరి సాగును తగ్గించి ఇతర ఆరుతడి పంటలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎ.పి.సి., ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో పంటల వైవిధ్యీకరణపై జిల్లా అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎ.పి.సి., ప్రభుత్వ కార్యదర్శి మాట్లాడుతూ పంటల వైవిద్దీకరణపై రైతులకు అవగాహన కల్పించి అధిక నీటి వినియోగం ఉన్న వాటికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. పంట రుణాల రీషెడ్యూల్, యాసంగి పంటల ప్రణాళిక, ఎరువుల వినియోగం, సూక్ష్మ సేద్యం, రైతు రిజిస్ట్రీ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు తీసుకున్న పంట రుణాలను మోరటోరియం సదుపాయంతో రీషెడ్యూల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి రైతులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బ్యాంకులను సంప్రదించి అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించి, ప్రత్యామ్నాయంగా ఇతర ఆరుతడి పంటలు, కూరగాయల సాగును చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని, యాసంగి పంటల ప్రణాళికపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. పంటలకు అవసరమైన మేరకే ఎరువులు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎరువుల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, ఎరువుల దుకాణాలలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు సంబంధించిన మంజూరీలను త్వరితగతిన పూర్తి చేయాలని, కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పనులలో పురోగతి సాధించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులందరూ రైతు రిజిస్ట్రీలో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని, ఈ ప్రక్రియపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారుజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో జిల్లాలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు, వరికి బదులుగా తక్కువ నీటి వినియోగం గల ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎరువుల దుకాణాలలో నిరంతర తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా ఉద్యానవన అధికారి అనిత, జిల్లా సహకార అధికారి కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.