📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅర్హులందరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అర్హులందరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

*అర్హులందరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి*

*విట్టాపూర్‌లో పథకాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ లింగు రామ్ పటేల్*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 26:–
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని విట్టాపూర్ గ్రామ సర్పంచ్ లింగు రామ్ పటేల్ సూచించారు. కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో బుధవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెంగ్లె ఉత్తమ్, ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యుడు సురేష్, గ్రామ పెద్దలు ఆలూరు లింగారెడ్డి, సీహెచ్ రవి తదితరులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.