📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకంటి అద్దాల సరఫరాకు బాక్స్ టెండర్ల ఆహ్వానం

కంటి అద్దాల సరఫరాకు బాక్స్ టెండర్ల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

కంటి అద్దాల సరఫరాకు బాక్స్ టెండర్ల ఆహ్వానం

నవంబర్ 27న టెండర్ నోటిఫికేషన్ జారీ

29న ఉదయం 11 గంటలకు టెక్నికల్ టెండర్ల పరిశీలన

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26:

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ (ఎన్‌పీసీబీ) విభాగానికి అవసరమైన కంటి అద్దాల సరఫరా కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి బాక్స్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ టెండర్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 27న టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల ఏజెన్సీలకు నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్ ఫారాలను అందజేయనున్నట్లు తెలిపారు.

నవంబర్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు టెక్నికల్ టెండర్లను తెరిచి పరిశీలించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల ఏజెన్సీలు నవంబర్ 28న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెద్దపల్లిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

టెండర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్ www.peddapalli.telangana.gov.in ను సందర్శించాలని డాక్టర్ వై. పవిత్ర కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.