📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరీసర్వేలో అక్రమార్కుల పేర్లు నమోదు చేయొద్దు

రీసర్వేలో అక్రమార్కుల పేర్లు నమోదు చేయొద్దు

📰 Generate e-Paper Clip

రీసర్వేలో అక్రమార్కుల పేర్లు నమోదు చేయొద్దు!

• ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలి

• సుడిబాకలో ఆర్డీవో కృష్ణవేణికి తుడుం దెబ్బ నాయకుల వినతి

• అక్రమ పట్టాలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

వెంకటాపురం (నూగురు), నవంబర్ 26 (మన ప్రజావాణి): మండలంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను భూ రీసర్వేలో గుర్తించి, తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్ డిమాండ్ చేశారు. గురువారం భూ రీసర్వే పనుల పరిశీలన నిమిత్తం మండలంలోని సుడిబాక గ్రామానికి వచ్చిన ఆర్డీవో కృష్ణవేణికి సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఏజెన్సీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి:
అనంతరం రేగ గణేష్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోకి అక్రమంగా వలస వచ్చిన కొందరు గిరిజనేతరులు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న భూ రీసర్వేలో సమగ్ర విచారణ జరిపి, గిరిజన చట్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు. సర్వే రికార్డులలో ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనేతరుల పేర్లను నమోదు చేయవద్దని, వాటిని ప్రభుత్వ భూములుగానే గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఏజెన్సీ చట్టాలకు లోబడి నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు.
చర్యలు లేకపోతే ఉద్యమం ఉధృతం:
గతంలోనూ ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ పట్టాల జారీపై అధికారులకు ఫిర్యాదులు చేశామని, వాటిపై ఎలాంటి ఆలస్యం లేకుండా విచారణ జరిపి కఠిన చర్యలకు ఆదేశించాలని ఆర్డీవోను కోరారు. అధికారులు స్పందించని పక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి, సీనియర్ నాయకులు పూనెం మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.