📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ అంబేద్కర్ ఆశించిన ఫలాలు అందాలి

భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ అంబేద్కర్ ఆశించిన ఫలాలు అందాలి

📰 Generate e-Paper Clip

బద్వేల్. నవంబర్ 26 ప్రజావాణి రాజ్యాంగం అంటే కేవలం పుస్తకం కాదు అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని,సమానత్వాన్ని ప్రసాదించిన ఒక మహత్తర ఆయుధం! అని అంబేద్కర్ విగ్రహ కమిటీ కన్వీనర్ నాగ దాసరి చిన్న రాయుడు పేర్కొన్నారు. సామాజిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఓఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదించిన పవిత్రమైన రోజు ఇది.భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించాలనే గొప్ప లక్ష్యంతో రాజ్యాంగ రూపకల్పనలో విశేష కృషి చేశారు.వేల సంవత్సరాలుగా వివక్షకు, అంటరానితనానికి,సామాజిక అసమానతలకు గురైన ప్రజలకు రాజ్యాంగం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఓటు హక్కు నుంచి విద్యా హక్కు వరకు, సమాన అవకాశాల నుంచి సామాజిక న్యాయం వరకు ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు రాజ్యాంగం మార్గం చూపింది.ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గంతో పాటు సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు,ఆత్మగౌరవం,సమాన అవకాశాల కోసం నిరంతరం చైతన్యాన్ని కలిగిస్తున్న అంబేద్కర్ పోరాట స్ఫూర్తి ఈ సందర్భంలో స్మరించుకోవాల్సిన విషయం.రాజ్యాంగం మనకు హక్కులను ఇచ్చింది,ఆ హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.కుల,మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలి అని నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి ఘనమైన నివాళులుభారత రాజ్యాంగం వర్ధిల్లాలి!సామాజిక న్యాయం పరిఢవిల్లాలి!అణగారిన వర్గాల ఆత్మగౌరవం వెల్లివిరియాలి!ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య సమితి రాష్ట్ర నాయకులు బీసీ రమణ.అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, పూలే ఆశయ సాధన సమితి నాయకులు గురుమూర్తి సహజ కవి వర్మ,మడకల వారి పల్లి మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు,చాట్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.