భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ అంబేద్కర్ ఆశించిన ఫలాలు అందాలి
బద్వేల్. నవంబర్ 26 ప్రజావాణి రాజ్యాంగం అంటే కేవలం పుస్తకం కాదు అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని,సమానత్వాన్ని ప్రసాదించిన ఒక మహత్తర ఆయుధం! అని అంబేద్కర్ విగ్రహ కమిటీ కన్వీనర్ నాగ దాసరి చిన్న రాయుడు పేర్కొన్నారు. సామాజిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఓఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీకి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని...