ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
మన ప్రజావాణి
చౌడేపల్లి: నవంబర్ 26
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్, అధ్యాపకులు బాలాజీ ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, దీపారాధన చేశారు. అనంతరం విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి వివరించారు.
ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, రవి కుమార్ సురేష్ నౌషాద్ ఖాన్ నరసింహులు బాలు పోల్ రెడ్డి సంతమ్మ అరుణ రాజేశ్వరి నాగార్జున రెడ్డి భాష సునీత
విద్యార్థులు పాల్గొన్నారు.

