రెండు వివాహ మహోత్సవాల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం జరిగిన రెండు వివాహ మహోత్సవాల్లో పాల్గొని సందడి చేశారు.
ముందుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుమారుడి వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు కుటుంబాలకు శుభాభినందనలు తెలియజేశారు.
ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో ఝాన్సీ రాజేందర్ రెడ్డి కలిసి ముచ్చటించారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.

