📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్3 ఏళ్లలో 1472 కోట్ల అభివృద్ధి పైన ప్రగతి నివేదిక విడుదల చేసిన కడియం శ్రీహరి

3 ఏళ్లలో 1472 కోట్ల అభివృద్ధి పైన ప్రగతి నివేదిక విడుదల చేసిన కడియం శ్రీహరి

📰 Generate e-Paper Clip

-విమర్శకులకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. నివేదికలో ఒక్కటి తప్పని నిరూపించండి

-స్టేషన్ ఘనపూర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.. కడియం శ్రీహరి

-బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఎంపీ కడియం కావ్య

-కాంగ్రెస్ కుటుంబంలో క్రమశిక్షణ తప్పనిసరి కడియం శ్రీహరి

-స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రగతి నివేదిక విడుదల

-రేవంత్ ను మళ్లీ సీఎం, రాహుల్ ను పీఎం చేయడమే లక్ష్యం – కడియం శ్రీహరి, కావ్య

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: రఘునాథపల్లి మండలం నీడిగొండ సమీపంలోని సత్య సాయి కన్వెన్షన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన బుధవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కూడా చైర్మన్ గుండు సుధారాణి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, ఏఐసీసీ పరిశీలకులు కేబీఆర్ నాయుడు, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ దుద్దిల్ల శ్రీను బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి, హన్మకొండ, జనగామ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, లకావత్ ధన్వంతి, మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు హాజరయ్యారు.

ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ డిసెంబర్ కు 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గ ప్రగతి నివేదికను ప్రజల ముందు ప్రవేశపెట్టారు. ఈ 3 ఏళ్లలో 1472 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఈ నివేదికను ప్రతీ కార్యకర్త వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

ఏం అభివృద్ధి చేశావ్ అని విమర్శించే వాళ్ల నోర్లు ఈ ప్రగతి నివేదిక మూయిస్తుందని అన్నారు. నివేదికలోని ఏ ఒక్క అంశం నిజం కాదని నిరూపించినా దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. ఇంకా రెండేళ్లలో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కట్టింది ఎవరు? లక్ష కోట్లు ఖర్చు చేసింది ఎవరు? మెడిగడ్డ పిల్లర్లు కూలిపోవడానికి కారణం ఎవరు? అని కేటీఆర్, హరీష్ రావులను ప్రశ్నించారు. తెలంగాణ నీటి వాటాలను ఆంధ్రాకు కట్టబెట్టింది కేసీఆర్, హరీష్ రావులే అని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యంతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని అన్నారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, కుటుంబ పెద్దగా నేను ఉన్నానని, ఎవరికీ ఏ కష్టం వచ్చినా నాకు చెబితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలలో రేవంత్ రెడ్డిని మరోసారి సీఎం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఓట్ల చోరీ నుంచి విరాళాల చోరీ వరకు మోదీ పాలనలో అన్నీ వివాదాలే అని విమర్శించారు. బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని, ఆ రెండు పార్టీలది లోపాయికారీ బంధమని అన్నారు. వరంగల్ అభివృద్ధికి రూ.6,500 కోట్లు వస్తుండగా, అందులో స్టేషన్ ఘనపూర్ కు రూ.1,600 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, జిల్లా కమిటీ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.