📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణముగిసిన 71వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ముగిసిన 71వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

📰 Generate e-Paper Clip

ముగిసిన 71వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

ప్రజావాణి నవంబర్ 24

బాలుర విభాగంలో వరంగల్.. బాలికల విభాగంలో మెదక్ జట్టు విజయం

క్రీడాకారులకు న్యాయం జరిగేలా ఫెడరేషన్ గుర్తింపు పునరుద్ధరణకు కృషి : ఎం. శ్రీనివాసరావు

(హనుమకొండ జిల్లా) కమలాపూర్‌లో ఈటెల మల్లయ్య–వెంకటమ్మ స్మారకార్థం నిర్వహించిన 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 22 నుంచి 24 వరకు కమలాపూర్ మండల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నాయి

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్ ఆక్టోపస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రావాల్సిన రిజర్వేషన్లు ఫెడరేషన్ గుర్తింపు పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు 2012లో ప్రవేశపెట్టిన 2 శాతం క్రీడా రిజర్వేషన్‌లో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు విద్యలో క్రీడా రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు ఉద్యోగాల్లోనూ సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు క్రీడాకారులకు న్యాయం జరిగేలా అవసరమైతే న్యాయపోరాటం చేపట్టి హక్కులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు

అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పునరుద్ధరణ పెండింగ్‌లో ఉండటంతో క్రీడాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ఈటల రాజేందర్ సహకారం కోరుతున్నామని క్రీడాకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఫెడరేషన్ గుర్తింపు సమస్య పరిష్కారమైతే జాతీయ స్థాయి, పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు

విజేతల వివరాలు:

బాలుర విభాగం:
– మొదటి స్థానం: వరంగల్
– రెండో స్థానం: ఆదిలాబాద్
– మూడో స్థానం: కరీంనగర్

బాలికల విభాగం:
– మొదటి స్థానం: మెదక్
– రెండో స్థానం: ఖమ్మం
– మూడో స్థానం: వరంగల్

ఈ కార్యక్రమానికి కమలాపూర్ మండల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పబ్బు సతీష్ అధ్యక్షత వహించగా, గౌరవ అతిథిగా హనుమకొండ డీఎస్పీ కొత్త ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే క్రీడా పరిశీలకులు, బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మాజీ అధ్యక్షులు కార్యదర్శులు సీనియర్ క్రీడాకారులు కోచ్‌లు నిర్వాహకులు హాజరయ్యారు

టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ సుదర్శన్ రాష్ట్ర కార్యదర్శి వి.వి రమణ గౌరవ అధ్యక్షుడు బాలసాని రమేష్, మాజీ కార్యదర్శి రవిచంద్ర కోడూరు స్పాన్సర్లు ఈటల సమ్మన్న, ఈటల భద్రయ్య తదితరులను ఈ సందర్భంగా అభినందించారు

వివిధ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శులు వరంగల్ అడ్‌హాక్ కమిటీ సభ్యులు గూడూరు సర్పంచ్ బండి వనజ కళాధర్, చీఫ్ రిఫరీ రామకృష్ణారెడ్డి రిఫరీలు కోచ్‌లు, మేనేజర్లు వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొని పోటీల ముగింపు వేడుకలను విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.