📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తా.. యువతకు అండగా ఉంటా

నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తా.. యువతకు అండగా ఉంటా

📰 Generate e-Paper Clip

నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తా.. యువతకు అండగా ఉంటా

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి

పొనుగోడు, నవంబర్ 24 (ప్రజావాణి):

నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, వారి హక్కుల సాధన కోసం పోరాడుతానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.

మంగళవారం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిరుద్యోగ యువతను కలిసి వారి సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

యువత తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, నిరుద్యోగుల గొంతుకగా శాసనమండలిలో నిలబడి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రశ్నించే గొంతుకకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీహరి, వెంకటరమణ, రాంసైదులు, మన్సూర్ అలీ, అనంతు కర్ణాకర్, రామ్ మధు, సైదిరెడ్డి, బచ్చలకూరి నగేష్, ప్రసాద్, అంజి, నరహరి, శ్రవణ్, రామకృష్ణ, కార్తీక్, సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.