నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తా.. యువతకు అండగా ఉంటా

నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తా.. యువతకు అండగా ఉంటా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పొనుగోడు, నవంబర్ 24 (ప్రజావాణి): నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూ, వారి హక్కుల సాధన కోసం పోరాడుతానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిరుద్యోగ యువతను కలిసి వారి సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియలో ఎదురవుతున్న...