📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసమష్టి కృషితోనే స్వర్ణోత్సవాల విజయం

సమష్టి కృషితోనే స్వర్ణోత్సవాల విజయం

📰 Generate e-Paper Clip

సమష్టి కృషితోనే స్వర్ణోత్సవాల విజయం

సంఘం నాయకులకు గోడ గడియారాల అందజేత

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 24

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 50 ఏళ్లుగా పనిచేస్తున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవాలను విజయవంతం చేయడంలో నాయకులు, కార్యకర్తల కృషి మరువలేనిదని స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్, సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య అన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయని తెలిపారు.

జిల్లా అధ్యక్షుడు లంక సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమకూర్చిన గోడ గడియారాలను వివిధ మండలాల నుంచి తరలివచ్చిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ నాయకులకు మామిడిపల్లి బాపయ్య, లంక సదయ్యలు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణోత్సవ సభ నిర్వహణకు ఆర్థికంగా అండగా నిలిచిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆసంపల్లి వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా వేడుకలకు హాజరైన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోరుకంటి చందర్, సంఘం జాతీయ అధ్యక్షుడు ఎస్. వరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్‌తో పాటు ఇతర జాతీయ, రాష్ట్ర కమిటీ బాధ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన మండలాల నాయకులు, కార్యకర్తలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉత్తర తెలంగాణ జిల్లాల ఇన్‌చార్జి బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కవ్వంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి పాల రాజేశం, నాయకులు ఇంటిబిల్లి రవీంద్ర కుమార్, సంకెనపల్లి లక్ష్మయ్య, సుంచు మల్లేష్, చొప్పదండి మల్లేష్, బొల్లి నందయ్య, కాంపల్లి నర్సయ్య, పెరిక బానేష్, బాదే వెంకటేష్, కాసిపేట పోచం, కన్నూరి బాబు, బూడిద సమ్మయ్య, పుల్లూరి మహేందర్, మహిళా నాయకురాళ్లు రామలక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.