📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజా సంకల్ప బలమై సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన

ప్రజా సంకల్ప బలమై సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన

📰 Generate e-Paper Clip

ప్రజా సంకల్ప బలమై సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రజాపాలన

మద్దూరు నవంబర్24, ప్రజా వాణి,

ప్రజల సామాజిక, ఆర్థిక పరివర్తనలో మార్పు జరిగినప్పుడే, నిజమైన పరిపాలన రాజ్యాంగ పలాలు ప్రజలకు చేరువవుతాయి. అలాంటి పరిపాలన దిశగా నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి మూలం అవుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలన్నిటిలో బిఆర్ఎస్ పరిపాలన చూసిన ప్రజానికం కాంగ్రెస్ సారథ్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు. ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ నినాదం బలపడిందో, ఆ నినాద ఆశయాన్ని విడిచిపెట్టి కుటుంబ పాలనకు తెరలేపిన బిఆర్ఎస్ వ్యక్తిగత రాజకీయ, ఆర్థిక దిశగా నాటి ప్రభుత్వం కొనసాగింది. అమరవీరులు నిర్మించిన రాష్ట్రంపై నయా దోర భూస్వామ్య వ్యవస్థలు రూపు దాల్చాయి. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని విస్మరించి ప్రజాకంఠక పాలనను సాగించారు.విద్యారంగంలో కేజీ టు పీజీ ఉచిత విద్య ఎండమావి గానే మారింది. వైద్య రంగాన్ని విస్మరించినారు.వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని చెప్పి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోగా లక్ష కోట్ల అవినీతికి ఆద్యం పోశారని రాష్ట్రం కోడైకొస్తుంది. మేడిగడ్డ బ్యారేజీని నాసిరకంగా నిర్మించి నీటి నిల్వలకు తావు లేకుండా చేశారు. గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును విస్మరించి ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అవినీతికి పాల్పడినారు. విద్యుత్తు రంగంలో డిస్క్రిమ్లకు చెల్లించాల్సిన మొత్తం రూపాయలను పెండింగ్ చేశారు. అసంఘటిత, కార్మిక వర్గాన్ని సంఘటితమైన కార్మిక వర్గాన్ని విస్మరించి అనేక సంస్కరణలకు తిరలేపి, ఉద్యమ సంఘాలను అణిచివేశారు. అనేక హామీలలో ఒకటైన డబల్ బెడ్ రూమ్ అమలు జరగలేదు . అక్కడక్కడ అమలు జరిగిన నాసీ రకమైన నిర్మాణాలు జరిపి కమిషన్లు దండుకున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలు కుటుంబపరమైనవి. ప్రతి ఇంటికి నీరు ఇస్తానని చెప్పి ఆ నీటిలోనే స్కామ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీ మూడు ఎకరాల భూమి దళిత ముఖ్యమంత్రి దళిత బంధు పేరుతో దగా చేసినారు.బీసీ బందు బిఆర్ఎస్ బంద్ గా మారింది. ధరణి పేరుతో భూ అక్రమాలకు తేరలేపినారు. పల్లెల నుండి పట్నం వెళ్లిన వారికి ధరణి పేరుతో పట్టాదారునిగా చేసినారు. దీంతో వేలది మంది రైతులు అవస్థలు పడినారు. అలాగే ఏకకాలంలో అనవసరమైన భూములకు ప్రైవేటు స్థలాలకు ధరణిలో స్థానం కల్పించి, రైతుబంధువేసి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రభుత్వాన్ని నడిపిన పెద్దలు వేల్హది ఎకరాల సంపాదించి ఫామ్హౌస్ నిర్మాణం చేపట్టినారు.
మహిళా సాధికారత కోసం ఆనాటి ప్రభుత్వం పని చేయలేదు.మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించబడలేదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే లాఠి చార్జీల మోత మోగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేస్తే, ప్రతిపక్షాలను అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా నిరసన తెలియజేస్తే ఇందిరాపార్కు ధర్నా స్థలాన్ని రద్దు చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఏ ఉద్యమాన్ని అయినా అణిచివేసింది. ఉద్యమకారులను హక్కున చేర్చుకోక పోవడం మాని ప్రజా కళాకారులకు ద్రోహం చేసింది. సబ్బండ వర్గాల రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాష్ట్రంగా మార్చేశారు. ఉద్యమ ఆశయం వాటి నినాదాలకు తావు లేకుండా చేసి, ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీయించి, అప్పుల ఊబిలోకి నెట్టివేశారు.జర్నలిస్టులకు ఇంటి స్థలం ఇవ్వడంలో విఫలం చెందింది. ఇలా అనేక రకాల రంగాలను మోసం చేయడమే కాకుండా నిర్బంధాన్ని రాష్ట్ర ప్రజలపై ప్రయోగించింది. అక్రమ అరెస్టులు లాఠీచార్జి చేస్తూ కేసులు పెడుతూ, భయనాక వాతావరణం సృష్టించీది. ఇలాంటి ప్రభుత్వం పై ప్రజా తిరుగుబాటు మొదలై ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజానీకం ఆదరించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వంతో ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రజల సమస్యలు వారి ఆశయాలు ఆకాంక్షలను నెరవేరుస్తూ, ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకు పోతుంది. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిని కొనసాగిస్తుంది. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో చెలిమి చేస్తూనే, హోట్ చోరీ లాంటి ఉద్యమాన్ని నడిపిస్తుంది. అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ప్రజా పాలలను కొనసాగిస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతపాక్షంగా ఉన్న బిఆర్ఎస్ ను ప్రజా అసెంబ్లీలోనే ఎండగాడుతూ, వారి ప్రభుత్వంలో జరిగిన ప్రతి తప్పును వారు చేసిన విధానాన్ని ఎండగడుతుంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన సిరిసిల్ల, సిద్దిపేట సభ విజయవంతంగా ముగించడంతో పాటు వేలాది మంది కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. బలవంతులైన రాచరికపు విధానాలతో తమ కోటలను నిర్మించుకున్న ఈ నియోజకవర్గాలపై గురిపెడుతూ, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తుంది.
ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడి ఆత్మగౌరవం కోసం సామాజిక హక్కుల నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది.భూ భారతి తో భూముల రైతుల హక్కులను కాపాడింది. భూ సర్వే చేపట్టి భూ రికార్డ్ ల నవీకరణ చేస్తుంది.
ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చి ఉచిత సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి కడుపుకు అన్నం మెతుకు అవుతుంది మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సారధ్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో నూతన పెన్షన్ మంజూరు చేసింది. రాజీవ్ యువకిరణాల పేరుతో యువత ఉపాధి పై దృష్టి సారించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆదివాసి గిరిజన ప్రాంతాలను అభివృద్ధికీ కృషి చేస్తుంది. పెట్టుబడుదారులకు కేంద్రం గా తెలంగాణను తయారు చేస్తూ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ఫోర్త్ సిటీకి నిర్మాణానికి పునాది వేసింది. మూసి సుందరీమణ చేపట్టాబోతుంది. గత ప్రభుత్వ హయాంలో కూచించుకుపోయిన అక్రమాలకు గురైన చెరువులను గుర్తించి, హైడ్రా ద్వారా చెరువులకు పునర్జీవం పోసి ఆక్రమించిన చెరువులన్నిటిని స్వాధీనపరచుకొని ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. విద్యా రంగంలో మౌలికమైన మార్పు కోసం స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతు ప్రారంభించింది. అధికారం చేపట్టిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లక్ష ఉద్యోగాల భర్తీకి నిరంతరాయంగా కృషి చేస్తుంది. ప్రతి పేదవాడి గృహానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా చేస్తుంది . మహిళ సాధికారత కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో మంత్రి సీతక్క గారి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతులకు మేలు చేసే దాన్యం కొనుగోలు చేస్తుంది. సబ్సిడీ యంత్రాలు వ్యవసాయ యాంత్రికరణకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని 10 లక్షల రూపాయలకు పొడిగించి ఆదుకుంటుంది. అమరవీరుల కుటుంబాలకు దారి చూపి రాష్ట్ర ప్రభుత్వంలో చోటు కల్పించింది. ప్రజా కవులకు ప్రజా ప్రభుత్వంలో చోటు కల్పించి, ప్రశ్నలను స్వీకరిస్తూనే పరిష్కారం చూపుతుంది. వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం కృషిని కొనసాగిస్తూనే, ప్రజా సమూహాన్ని చైతన్య పరుస్తూ, గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్యాయాన్ని వెలుక్కుతీస్తూనే ప్రతి స్కీములో జరిగిన ప్రతి స్కామ్ ను బయటపెడుతూ, భూ దోపిడి, జల దోపిడి ని ప్రజల ముందు నిలిపే ప్రయత్నం సాగుతుంది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను అమలు పరుస్తూ ప్రజా సంక్షేమము దిశగా పని చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధిని కోరే ఈ ప్రభుత్వంన్ని మళ్ళీ గెలిపించండి. ప్రజా పాలనను కొనసాగించాలి..

వ్యాసకర్త…
గద్దల మహేందర్..
జనగామ నియోజకవర్గం..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.