భక్తి ఆధ్యాత్మికతను ప్రతీక కార్తీక మాసం
జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి-సాయ గౌడ్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 24
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జుక్కల్ గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి -సాయ గౌడ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. కార్తీక మాసం ఆధ్యాత్మికతను, భక్తి భావానికి, పవిత్రతకు ప్రతీక అని పేర్కొన్నారు.. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ, దీపారాధనలు, పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని కోరుకున్నారు.. జుక్కల్ మండల ప్రజలందరికీ శుభం కలగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి -సాయ గౌడ్ ఆకాంక్షించారు..

