📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్కవలకుంట్లలో హోరెత్తిన వైసీపీ'ప్రచారం:జగనన్నతోనే గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

కవలకుంట్లలో హోరెత్తిన వైసీపీ’ప్రచారం:జగనన్నతోనే గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

📰 Generate e-Paper Clip

కవలకుంట్ల పోరుమామిళ్ల,నవంబర్ 23:ప్రజావాణి పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.కవలకుంట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరపోగు గురయ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు.సోమవారం కవలకుంట్ల హరిజనవాడలో అభ్యర్థి వీరపోగు గురయ్య మద్దతుగా రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హరిజనవాడకు చేరుకున్న నాగార్జున రెడ్డి కి,పార్టీ నాయకులకు స్థానిక మహిళలు, యువకులు,కవలకుంట్ల ప్రజలు హారతులు పట్టి, ఘనస్వాగతం పలికారు.నాయకులు ప్రతి ఇంటికీ తిరుగుతూ,జగనన్న సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గురయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.జగనన్న సీఎం అయితేనే గ్రామాలకు ప్రత్యేక నిధులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.గ్రామాల్లో నిజమైన అభివృద్ధి జరగాలన్నా,సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం.జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడానికి,గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక నిధులను తీసుకురావడం జరుగుతుంది”అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.గతంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పాలనను ప్రజలు మరచిపోలేరని స్పష్టం చేశారు.వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి సాగు,త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వెలుగొండ ప్రాజెక్టుపై నాగార్జున రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి,పోరుమామిళ్ల మండలంతో పాటు ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు,ప్రతి ఇంటికీ త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ఈ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని,అందుకోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వీరపోగు గురయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. భారీగా తరలివచ్చిన నాయకులు,ప్రజలు ఎన్నికల ప్రచారంలో భాగంగా హరిజనవాడ జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్,ముఖ్య నాయకులు చిన్న పేరయ్య,మాజీ సర్పంచ్ పేరయ్య,నారాయణ,జక్కయ్య,తిరుపతయ్య, సుబ్బరాయుడు,పిరయ్యతో పాటు స్థానిక పంచాయతీ నాయకులు,వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.అభ్యర్థి గెలుపే లక్ష్యంగా యువతీ యువకులు,మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వీస్తున్న గాలిని చూస్తుంటే వీరపోగు గురయ్య విజయం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.