కవలకుంట్లలో హోరెత్తిన వైసీపీ’ప్రచారం:జగనన్నతోనే గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
కవలకుంట్ల పోరుమామిళ్ల,నవంబర్ 23:ప్రజావాణి పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.కవలకుంట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరపోగు గురయ్య గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు.సోమవారం కవలకుంట్ల హరిజనవాడలో అభ్యర్థి వీరపోగు గురయ్య మద్దతుగా రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఇంటింటి ప్రచార...