📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఉదయం 5:00 లకె వ్రతాలు ప్రారంభం

ఉదయం 5:00 లకె వ్రతాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

*ఉదయం 5:00 లకె వ్రతాలు ప్రారంభం…*

*ఆలయ కార్యనిర్వహణ అధికారి భవాని శంకర్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 23*

తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో తేదీ 24 నవంబర్ 2026 మంగళ వారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్క రించుకొని భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవ స్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గత సంవత్సర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పడిన భక్తుల రద్దీతో పాటు , ప్రస్తుత కార్తీక మాసంలో శని , ఆది వారాలు మరియు ఇతర సెలవు దినాలలో ఏర్పడిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నందున , భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్రతాలను సౌకర్య వంతంగా , క్రమబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా వ్రత పూజల నిర్వహణకు అవసరమైన పూజా సామాగ్రిని కూడా ముందుగానే సిద్ధం చేయించారు. కార్య నిర్వహణాధికారి వ్రత మండపాన్ని , భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మరియు చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి , సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. మంగళవారం ఉదయం 5:00 గంటల నుంచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రారంభించ బడతాయి. కావున కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలు ఆచరించి , తమ మొక్కులు చెల్లించుకొని శ్రీ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.