ఎత్తొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం.
రెండో విడతలో మంజూరైన 29 ఇళ్లకు ముగ్గు వేస్తున్న సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్.
మొదటి విడతలో మంజూరైన 50 ఇళ్ల నిర్మాణం పూర్తి, గృహప్రవేశాలు.
లబ్ధిదారుకు ఇంటి నమూనా పత్రం అందజేత.
కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని ఎత్తొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత గృహ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రామానికి రెండో విడతలో మంజూరైన 29 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శ్వేతా సూర్యకాంత్ ముగ్గు వేసి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా లబ్ధిదారుకు మంజూరైన ఇంటి నమూనా పత్రాన్ని సర్పంచ్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.గ్రామానికి మొదటి విడత లో 50 ఇళ్లు మంజూరు కాగా వాటన్నింటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా నిర్వహించామని గుర్తు చేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 29 ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు.నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చ డమే ప్రభుత్వ లక్ష్యమని.లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా నాణ్యతతో ఇంటి నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకాంత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యకాంత్,వార్డు సభ్యులు ఆల్కే రమేష్, గ్రామస్తులు మిద్దె హన్మంతు,బొజ్జ సాయిలు,దండు లాలు, పంచాయతీ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

