📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్హుస్నాబాద్‌లో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు.. ముగ్గురిపై కేసు నమోదు

హుస్నాబాద్‌లో వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడులు.. ముగ్గురిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

 

నిర్వాహకురాలు, మరో వ్యక్తితో పాటు విటుడిపై ఐటీపీఏ చట్టం కింద చర్యలు

హుస్నాబాద్, నవంబర్ 23 (ప్రజావాణి)

హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఏసీపీ సదానందం ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ పి. లక్ష్మారెడ్డి, పోలీసు సిబ్బంది గత రాత్రి తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం ఉన్న నిర్వాహకురాలు కంసాని అనిత, కంసాని రాముతో పాటు విటుడిపై ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టం–1956 (ఐటీపీఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడినా, బ్రోతల్‌ నిర్వహణలో భాగస్వాములైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ఇలాంటి ఘటనలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.