📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇనుగుర్తి"ప్రజావాణి"కి డిఎల్పిఓ హాజరు

ఇనుగుర్తి”ప్రజావాణి”కి డిఎల్పిఓ హాజరు

📰 Generate e-Paper Clip

ఇనుగుర్తి”ప్రజావాణి”కి డిఎల్పిఓ హాజరు
ప్రజావాణి,ఇనుగుర్తి:ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారం వారం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన ప్రజావాణి కొనసాగుతోంది. మండల కేంద్రం ఇనుగుర్తి లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి డి ఎల్పి ఓ గంగాభవాని హాజరయ్యారు. తహసిల్దార్ సుంకర శ్రీనివాసులు ఎంపీడీవో తోట హరీష్ పాల్గొన్నారు. ప్రజావాణికి రెవెన్యూ సంబంధించి కేవలం ఒకే దరఖాస్త రావడంతో అధికారులు స్వీకరించారు.

ప్రజావాణి చక్కని వేదిక: డిఎల్పిఓ

ప్రజావాణిలో పలు శాఖలకు చెందిన అధికారులు హాజరవుతున్న దృష్ట్యా సమస్యలు పరిష్కరించడానికి ఇది ఒక చక్కని వేదికని డి ఎల్ పి ఓ గంగాభవాని అన్నారు.మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి దృష్టికి తీసుకువచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.