*ఉచిత వైద్య సేవలతో ప్రజలకు ఆరోగ్య భరోసా చైర్ పర్సన్ శ్రీదేవి*
మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై వైద్యులు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని చైర్ పర్సన్ శ్రీదేవి కోరారు.

