📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరక్త సంబంధాలు - దేవుడు ఇచ్చిన వరం

రక్త సంబంధాలు – దేవుడు ఇచ్చిన వరం

📰 Generate e-Paper Clip

రక్త సంబంధాలు – దేవుడు ఇచ్చిన వరం

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

డబ్బుతో ఏదైనా కొనవచ్చు. ఇల్లు కొనవచ్చు, కారు కొనవచ్చు, హోదా కొనవచ్చు. కానీ ఒక్కటి మాత్రం డబ్బుతో కొనలేం. అదే రక్త సంబంధం.
తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల అనుబంధం, తాతయ్య, అమ్మమ్మల ఆశీర్వాదం.. ఇవన్నీ దేవుడు మనకు పుట్టుకతోనే ఇచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
ఈ రోజుల్లో చిన్న చిన్న మనస్పర్థలకే బంధాలు తెగిపోతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు, భూమి కోసం కుటుంబాలు విడిపోతున్నాయి. కానీ కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు.. మన పక్కన నిలబడేది మాత్రం మన కుటుంబమే.
కుటుంబం అంటే కేవలం నలుగురు వ్యక్తులు కాదు. మన ఉనికి ఆగిపోయేంత వరకు తోడుగా ఉండే ఒకే ఒక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ప్రాణంగా కాపాడుకుందాం.
బంధాలను గౌరవిద్దాం. పెద్దలను ప్రేమిద్దాం. పిల్లలకు ప్రేమను పంచుదాం. ఎందుకంటే.. చివరికి మిగిలేది మనం సంపాదించిన ఆస్తి కాదు, మనం నిలబెట్టుకున్న బంధాలే.

ప్రజావాణి ములుగు ప్రతినిధి శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.