📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశ్రీ వనలింగేశ్వర సమేత వనదుర్గాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా మహా వనసమారాధన

శ్రీ వనలింగేశ్వర సమేత వనదుర్గాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా మహా వనసమారాధన

📰 Generate e-Paper Clip

*శ్రీ వనలింగేశ్వర సమేత వనదుర్గాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా మహా వనసమారాధన*

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ ఉదయ జ్యోతి – ప్రసాద్ రావు

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 23

తెలంగాణం – అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలోని శ్రీ వనదుర్గాంబిక అమ్మవారి మహా వనసమారాధన భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. పచ్చని ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వేడుకకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ వేడుకలో మున్సిపల్ కౌన్సిలర్ ఉదయ జ్యోతి – ప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.

అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులతో కలిసి వారు భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు సంపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.