📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణBhadradri Kothagudemఏజెన్సీ మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు       

ఏజెన్సీ మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు       

📰 Generate e-Paper Clip

ఏజెన్సీ మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు                           ప్రజావాణి భద్రాద్రి కొత్తగూడెం  నవంబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పోలీస్ క్రీడా మైదానంలో అండర్ 17 బాలుర వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు పాఠశాల క్రీడా సమాఖ్య ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి బాపూసింగ్ తెలిపారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల మండలం అయిన చెర్ల మండలంలో ని    పోలీస్ క్రీడా మైదానంలో నేటి నుండి మూడు రోజులపాటు పగలు మరియు ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు పది ఉమ్మడి జిల్లాలలోని 120 మంది క్రీడాకారులు ఇప్పటికే చెర్లకు చేరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు అందరికీ స్థానిక ఉన్నత పాఠశాలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు  వారు తెలిపారు.  ఈ పోటీలను ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  మరియు  జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్   లు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలలో రాణించిన క్రీడాకారులను గుజరాత్ లో జరగబోయే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు బాపూ సింగ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.