📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్రంగసముద్రం సమగ్ర అభివృద్ధే ధ్యేయం: వైయస్సార్సీపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పశుపుల శృతి గెలుపే లక్ష్యంగా...

రంగసముద్రం సమగ్ర అభివృద్ధే ధ్యేయం: వైయస్సార్సీపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పశుపుల శృతి గెలుపే లక్ష్యంగా కదంతొక్కుతున్న గ్రామం!

📰 Generate e-Paper Clip

అభివృద్ధికి చిరునామా రంగసముద్రం.మన ఓటు మార్పు వైపు.మన మద్దతు వంకాయ గుర్తుకే!”

పోరుమామిళ్ల(రంగసముద్రం)నవంబర్ 22ప్రజావాణి గ్రామ స్వరాజ్యం,నిరంతర ప్రగతి,పారదర్శక పాలనే లక్ష్యాలుగా రంగసముద్రం గ్రామపంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పశుపుల శృతి గెలుపును కాంక్షిస్తూ రంగసముద్రం గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.నిబద్ధత,సేవాభావం,చదువుకున్న యువత నాయకత్వంలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పశుపుల శృతి ప్రజల ముందుకు వస్తున్నారు.మాజీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డి మార్గదర్శకంలో అప్రతిహత ప్రగతి ప్రయాణం! రంగసముద్రం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా సేవాలందించి,ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఈ ఎన్నికల సమర శంఖం పూరించబడింది.ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు,నిరుపేదలకు అందిన సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి ఆయన చూపిన చొరవ నేడు వైయస్సార్సీపి అభ్యర్థి విజయానికి బలమైన పునాదిగా మారాయి.చిత్త రవిప్రకాష్ రెడ్డి అనుభవం, మార్గదర్శకత్వం,పశుపుల శృతి యువ ఆలోచనలు జతకలిస్తే రంగసముద్రం పంచాయతీ నియోజకవర్గంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని గ్రామ పెద్దలు,యువత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పశుపుల శృతి ప్రజా సంకల్పం గ్రామ వికాస ప్రణాళిక:తన ప్రచారంలో భాగంగా పశుపుల శృతి ప్రతి ఇంటికీ వెళ్తూ,ప్రతి ఒక్కరిని కలుస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పన ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం,మంచినీటి సరఫరా.  యువత,మహిళా సాధికారత చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాల పట్ల అవగాహన, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థిక వృద్ధికి తోడ్పాటు.రైతు సంక్షేమం గ్రామంలోని రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు,సాగునీటి వసతులు సకాలంలో అందేలా చూడటం.ఆరోగ్యం విద్య:గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాలు,ఆరోగ్య కేంద్రాల ఆధునీకీకరణ.వంకాయ గుర్తుపై ఓటేద్దాం.ప్రగతిని గెలిపిద్దాం!ఈ ఎన్నికల్లో పశుపుల శృతి కి కేటాయించిన”వంకాయ గుర్తు”కేవలం ఒక గుర్తు కాదు,అది రంగసముద్రం గ్రామ భవిష్యత్తుకు,ప్రగతికి సంకేతం.అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ,ఉజ్వల భవిష్యత్తును కోరుకునే ప్రతి ఓటరు తమ అమూల్యమైన ఓటును వంకాయ గుర్తుపై వేసి,వేయించి పశుపుల శృతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డి మరియు వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలను భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నారు.”సేవే మార్గం.అభివృద్ధే లక్ష్యం.మీ ఆశీస్సులు,సహకారం ఎల్లప్పుడూ మన వంకాయ గుర్తుకే అందించండి!”రంగసముద్రాన్ని ఆదర్శ పంచాయతీగా మార్చడానికి మీరంతా తరలివచ్చి ఓటు వేయాలని గ్రామ కమిటీ పిలుపునిచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.