రంగసముద్రం సమగ్ర అభివృద్ధే ధ్యేయం: వైయస్సార్సీపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పశుపుల శృతి గెలుపే లక్ష్యంగా కదంతొక్కుతున్న గ్రామం!
అభివృద్ధికి చిరునామా రంగసముద్రం.మన ఓటు మార్పు వైపు.మన మద్దతు వంకాయ గుర్తుకే!" పోరుమామిళ్ల(రంగసముద్రం)నవంబర్ 22ప్రజావాణి గ్రామ స్వరాజ్యం,నిరంతర ప్రగతి,పారదర్శక పాలనే లక్ష్యాలుగా రంగసముద్రం గ్రామపంచాయతీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పశుపుల శృతి గెలుపును కాంక్షిస్తూ రంగసముద్రం గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.నిబద్ధత,సేవాభావం,చదువుకున్న యువత నాయకత్వంలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పశుపుల శృతి ప్రజల ముందుకు వస్తున్నారు.మాజీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డి మార్గదర్శకంలో అప్రతిహత ప్రగతి ప్రయాణం! రంగసముద్రం గ్రామానికి గతంలో...