📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణత్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట...

త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

📰 Generate e-Paper Clip

**త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్**

వరంగల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. త్రిపుర రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు ఘన స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారితో కలిసి గంట రవికుమార్ గారు ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గారు గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని శాలువాతో సత్కరించి, ఆత్మీయంగా గౌరవించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.