📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణచెకుముకి టాలెంట్ టెస్ట్ లో మెరిసిన చిన్నారులు

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మెరిసిన చిన్నారులు

📰 Generate e-Paper Clip

*చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మెరిసిన చిన్నారులు*

రాయికల్, నవంబర్ 21(ప్రజావాణి)

చెకుముకి విజ్ఞాన సంబరాలు 2026 సంవత్సరానికి గాను మండల కేంద్రంలో నిర్వహించిన
మండలస్థాయి ప్రతిభ పరీక్షలో భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. మండలంలోని అనేక పాఠశాలల విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షలో భూపతిపూర్ విద్యార్థులు ముందు వరుసలో నిలవడం పాఠశాలకే కాకుండా గ్రామానికే గర్వకారణంగా మారింది.ఈ పరీక్షలో ప్రతిభ చూపిన కొమ్ము షిపివిస్ట, సముడాల అమూల్య, మూడపెల్లి చైత్ర ఈ నెల 28న జరిగే జిల్లా స్థాయి ప్రతిభ పరీక్షకు ఎంపికయ్యారు. అదే విధంగా ఆంగ్ల భాషా పోటీ మండల స్థాయి ప్రతిభ పరీక్షలో నూకల సహజ ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయి పరీక్షకు అర్హత పొందింది.విద్యార్థుల ఈ విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. చిన్న గ్రామం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పెద్ద వేదికలపై సత్తా చాటగలరని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి. జిల్లా స్థాయిలో కూడా విద్యార్థులు ఇదే ప్రతిభను చూపి మండలానికి పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షించారు.ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు యు.వి. రమణీ, సర్పంచ్ గుర్రం భావన మహేందర్, ఉప సర్పంచ్ మూగల సంజీవచారి, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ అన్నవేని వేణు, మాజీ ఎంపిపి మహేశ్వర్ రావ్, మాజీ పాఠశాల అధ్యక్షులు జక్కుల రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, తోట శంకరయ్య, సాహెబ్ హుస్సేన్, సంజయ్ కుమార్, వేణుగోపాల్, కమారుద్దీన్, సురేష్, రాజగోపాల్, పుష్పలత, భవాని, వంశీధర్ రావు, రమేష్ మరియు కార్యాలయ సిబ్బంది సాయన్న, పారిశుద్ధ్య సిబ్బంది దోనిపాల సాయన్న తదితరులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.