చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మెరిసిన చిన్నారులు
*చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మెరిసిన చిన్నారులు* రాయికల్, నవంబర్ 21(ప్రజావాణి) చెకుముకి విజ్ఞాన సంబరాలు 2026 సంవత్సరానికి గాను మండల కేంద్రంలో నిర్వహించిన మండలస్థాయి ప్రతిభ పరీక్షలో భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. మండలంలోని అనేక పాఠశాలల విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షలో భూపతిపూర్ విద్యార్థులు ముందు వరుసలో నిలవడం పాఠశాలకే కాకుండా గ్రామానికే గర్వకారణంగా మారింది.ఈ పరీక్షలో ప్రతిభ చూపిన కొమ్ము షిపివిస్ట, సముడాల అమూల్య, మూడపెల్లి చైత్ర ఈ...