జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ దురంధరుడు స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుక శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరైనారు.
వేడుకా స్థలికి చేరుకున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి మర్రి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె వేదికపైకి వెళ్లి నూతన వధూవరులను అభినందించారు. వారికి పూలబొకేలు అందజేసి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మర్రి చెన్నారెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్యోన్యంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పెద్దల ఆశీస్సులతో, బంధుమిత్రుల ప్రేమాభిమానాలతో వారి జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు రాష్ట్రంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
