మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకలో హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి..!
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ దురంధరుడు స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుక శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా హాజరైనారు. వేడుకా స్థలికి చేరుకున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి మర్రి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె వేదికపైకి వెళ్లి నూతన వధూవరులను అభినందించారు. వారికి...