📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ చేయూత జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఇందిరమ్మ చేయూత జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ చేయూత జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

* జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్

* 17వార్డు కౌన్సిలర్ల కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం

జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నూతన పథకాలను అమలు చేస్తోందని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ అన్నారుమాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చేయూత, ఇందిరమ్మ జీవిత బీమా పథకాలను ప్రారంభించిందని తెలిపారు కుటుంబ పెద్దకు ప్రమాదవశాత్తు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారుఈ పథకంలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో వార్డు అధికారులువార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదుచేసుకోవాలనివిజ్ఞప్తిచేశారుఅదేవిధంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి 17వ వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, వార్డు కౌన్సిలర్‌తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.