📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం మాలోతు దశరత్ నాయక్

జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం మాలోతు దశరత్ నాయక్

📰 Generate e-Paper Clip

​జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: మాలోతు దశరథ్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20

-​ఉద్యమ కార్యాచరణ, సమన్వయ కమిటీల ప్రకటన
​సాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు ఉద్యమ విస్తరణ

​మిర్యాలగూడ నియోజకవర్గం
జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గాను ఉద్యమ కార్యాచరణ కమిటీని ప్రకటిస్తున్నట్లు నిర్వహణ కమిటీ నేత మాలోతు దశరథ్ నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో తీవ్ర ఆకాంక్ష ఉందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు.
​ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. త్వరలోనే నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నేతలను కూడా సంప్రదిస్తామని, ఆయా నియోజకవర్గాల నుండి ఉద్యమంలో పాల్గొనాలనుకునే వారు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించే ‘జిల్లా సాధన సమితి సమన్వయ కమిటీ’ వివరాలను ఆయన వెల్లడించారు.
​జిల్లా సాధన సమితి సమన్వయ కమిటీ వివరాలు:
​కార్యక్రమాలు & మీడియా విభాగం:
​కార్యక్రమాల నిర్వహణ: దశరథ్ నాయక్
​కార్యక్రమాల నిర్ధారణ: రాపోలు పరమేష్
​కార్యక్రమాల అమలు: సర్నాల వెంకయ్య యాదవ్, మంద శ్రీను, జోసెఫ్
​బాధ్యతల కేటాయింపు: తిరుమలగిరి అశోక్
​సమాచార బాధ్యతలు: జయరాజు, జోసెఫ్, మంద శ్రీనివాస్
​మీడియా బాధ్యత: మారం శ్రీనివాస్
​వచ్చిన వార్తల సేకరణ: చేగోండి మురళి యాదవ్, ఎండి అస్లాం
​జర్నలిస్టుల సమన్వయం: కలిమేల నాగయ్య, మంద సైదులు, బాలాజీ, మహేష్
​ప్రజాప్రతినిధులు & అన్ని వర్గాల సమన్వయం:
​అందరితో సమన్వయం: నూకల వేణుగోపాల్ రెడ్డి
​మంత్రులు, ఎమ్మెల్యేల అనుమతి: తమ్ముడు బోయిన అర్జున్, ఖాజా హమీదోద్దీన్
​ప్రజాప్రతినిధుల సమన్వయం: బెజ్జం సాయి
​ఉద్యోగ సంఘాల సమన్వయం: రాపోలు పరమేష్, కొర్ర కృష్ణకాంత్ నాయక్
​కులాలు & విద్యార్థి సంఘాల సమన్వయం:
​బీసీ సంఘాల సమన్వయం: గుండెబోయిన నాగేశ్వరరావు, ఈశ్వర చారి, మహిమూద్
​ఎస్సీ కుల సంఘాల సమన్వయం: నగేష్, మచ్చ ఏడుకొండలు
​ఎస్టీ సంఘాల సమన్వయం: కొర్ర కృష్ణకాంత్ నాయక్
​విద్యార్థి యువజన సంఘాల బాధ్యతలు: బంటు వెంకటేశ్వర్లు, ఫారుక్
​విద్యార్థి సంఘాల సమన్వయం: తిరుమలగిరి అశోక్, అంజి, సైదా నాయక్, రవీందర్ నాయక్
​రాజకీయ పార్టీల సమన్వయం:
​కాంగ్రెస్: వేణుగోపాల్ రెడ్డి
​బీఆర్ఎస్: ఎండి సోయాబ్
​బీజేపీ: చిలుకూరి శ్యామ్, నాగరాజు
​టీడీపీ: సత్యం, మాన్య నాయక్
​సీపీఎం: మూడవత్ రవి నాయక్
​సీపీఐ: బంటు వెంకటేశ్వర్లు
​ఎంసీపీఐ: కాశి
​బీఎస్పీ: దినేష్
​ధర్మ సమాజ్ పార్టీ: ఎల్లయ్య
​ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ: పరంగి రాము
​తెలంగాణ జన సమితి (టీజేఎస్): క్రాంతి కుమార్
​

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.