ఘనంగా యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలు
ఐదు దశాబ్దాలుగా కోదాడ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు యెర్నేని బాబు..
పేదల పక్షపాతిగా, ప్రజా నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు..
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో కోదాడను మరింత అభివృద్ధి చేస్తా : యెర్నేని బాబు..
కోదాడ, నవంబర్ 20 /ప్రజావాణి
కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యెర్నేని యువసేన సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శకుంతల థియేటర్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను ఏర్పాటు చేసి సంబరాల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ యెర్నేని వెంకట్ రత్నం బాబు గత ఐదు దశాబ్దాలుగా కోదాడ ప్రాంతంలో విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కొనసాగుతున్నారని కొనియాడారు. సర్పంచ్‌గా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, ఇతర ప్రజాప్రతినిధి హోదాల్లో పనిచేస్తూ కోదాడ పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, జనాకర్షణ కలిగిన వ్యక్తిగా నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ముఖ్యంగా సినిమా హాల్ బాబుగా ప్రజల మన్ననలు పొందిన ఆయన, పట్టిన పట్టు విడవకుండా ఎంతటి క్లిష్టమైన పనినైనా ధైర్యంగా పూర్తి చేయగల సమర్థత కలిగిన నాయకుడని ప్రశంసించారు. ప్రజల ఆదరాభిమానాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం యెర్నేని వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆదరాభిమానాలు పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తానని తెలిపారు.
అనంతరం తన సతీమణి, కోదాడ మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబుతో కలిసి అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య భారీ కేక్‌ను కట్ చేశారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ యెర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యెర్నేని యువసేన రావెళ్ల కృష్ణారావు లైటింగ్ ప్రసాదు, మైలారం శెట్టి భాస్కర్, కొండలు వంటి పులి శ్రీను ,సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

