*పెన్షన్లతో లబ్ధిదారులకు ఆర్థిక భరోసా : సర్పంచ్ రాజ్ కుమార్*
జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): దేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని 100 శాతం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో చేయూత కొత్త పెన్షన్ పత్రాలను గ్రామ సర్పంచ్ బ్యాగారి రాజ్ కుమార్ లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.ఈ క్రమంలోనే వితంతువులకు, ఒంటరి మహిళలకు,గీతా కార్మికులకు, దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

