📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలి

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలి

📰 Generate e-Paper Clip

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి
అమలు జరపాలి

26న జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలు జయప్రదం చేయండి

బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు
వెంకట్రాములు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి పకడ్బందీగా అమలు జరపాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం హనుమకొండలోని కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మునిగాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక
సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రాములు ప్రసంగిస్తూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజి రామ్ జీ తెచ్చి వ్యవసాయ కార్మికుల ఉపాధి హక్కును కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసింద
న్నారు. ఇప్పటికైనా ఎంజి నరే గాను పునరుద్ధరించి కేంద్ర బడ్జెట్ లో నిధులను పెంచి సంవత్సరంలో 200 రోజులు పనులు కలిగించి రోజుకు 700 కూలి ఇవ్వాలన్నారు.రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వ్యవసాయ కార్మికులకు చేసిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు జరపాలన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోస పథకం కింద వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ.12వేలుఇస్తామన్న
ఆర్థిక సహాయం మూడేళ్లు కావస్తున్న ఇప్పటి
వరకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొన్నందున యుద్ద ప్రాతిపదికన కరువు నివారణ చర్యలు చేపట్టాలని,14 రకాల నిత్యవసర సరుకులు చౌక డిపోల ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ
కార్మికుల డిమాండ్స్ సాధనకై ఈ నెల 26 న
కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలు జనవరి 9 నుండి 11 వరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో జరిగనున్నాయని మహాసభల జయప్రదానికై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు. సీపీఐ జిల్లాకార్యదర్శి కర్రె బిక్షపతి ప్రసంగిస్తూవ్యవసాయ
కార్మికుల పోరాటాలకు సిపిఐ అండగా ఉంటుంద
న్నారు. భూమికోసం భుక్తి కోసం సామాజిక న్యాయం కోసం పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కర్రె లక్ష్మణ్ ప్రసంగిస్తూ గ్రామ గ్రామాన సంఘ సభ్యత్వాన్ని చేర్పించి గ్రామ కమిటీల నిర్మాణం చేయాలన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సంఘ నాయకులు ఏదునూరు వెంకట్రాజం, బత్తిని సదానందం,గోకల రాజయ్య, పసునూరి సునీల్,బండ్లోజు రాజమణి,మునిగాల స్వామి,యాఖూబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.