*ఇందరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం.*
—*ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరోసా.*
—
—*అంకోల్ సర్పంచ్ జమున మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో.*
నస్రుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో అంకోల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇందరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుటుంబానికి భరోసా కల్పించడానికి ప్రవేశం పెట్టిందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ జమున మోహన్ యాదవ్ మాట్లాడుతూ పేద కుటుంబాల వారికి రూపాయలు. ఐదు లక్షల జీవిత బీమా కల్పించడం ఈ పథకం దీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈనెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ జమున మోహన్,ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, ఎంపీఓ సూర్యకాంత్, విట్టల్, పంచాయతీ కార్యదర్శులు, వార్డ్ నెంబర్లు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

