📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపసర నాగారంలో విద్యార్థుల చేతిలో నిఘంటువులు... భవిష్యత్తుకు బాటలు

పసర నాగారంలో విద్యార్థుల చేతిలో నిఘంటువులు… భవిష్యత్తుకు బాటలు

📰 Generate e-Paper Clip

*పసర నాగారంలో విద్యార్థుల చేతిలో నిఘంటువులు… భవిష్యత్తుకు బాటలు*

*గోవిందరావుపేట/ములుగు ప్రతినిధి (ప్రజావాణి)*:-
గోవిందరావుపేట మండలం
పసర నాగారం జడ్పీహెచ్ఎస్ లో గురువారం విద్యార్థులకు నిఘంటువుల పండగ.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన 250 రూపాయల విలువ చేసే 136 శంకరాచార్య నిఘంటువులను విద్యార్థినీ, విద్యార్థులకు అందజేశారు.
ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సమేశ్వరరావు చేతుల మీదుగా… ఉపాధ్యాయుల సమక్షంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఒక్కో విద్యార్థి చేతిలో నిఘంటువు… ఒక్కో భవిష్యత్తుకు తాళం చెవి.
నిఘంటువు అంటే కేవలం పుస్తకం కాదు… పదాలకు అర్థం చెప్పే గురువు!
ఈ పుస్తకంతో పిల్లల్లో తెలుగు భాషపై ప్రేమ పెరుగుతుంది… చదువుపై ఆసక్తి రెట్టింపు అవుతుంది.
పిల్లల ముఖంలో ఆనందం… ఉపాధ్యాయుల ముఖంలో సంతృప్తి.
ప్రభుత్వం అందించిన ఈ సాయం… పిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.