పసర నాగారంలో విద్యార్థుల చేతిలో నిఘంటువులు… భవిష్యత్తుకు బాటలు

*పసర నాగారంలో విద్యార్థుల చేతిలో నిఘంటువులు... భవిష్యత్తుకు బాటలు* *గోవిందరావుపేట/ములుగు ప్రతినిధి (ప్రజావాణి)*:- గోవిందరావుపేట మండలం పసర నాగారం జడ్పీహెచ్ఎస్ లో గురువారం విద్యార్థులకు నిఘంటువుల పండగ. రాష్ట్ర ప్రభుత్వం అందించిన 250 రూపాయల విలువ చేసే 136 శంకరాచార్య నిఘంటువులను విద్యార్థినీ, విద్యార్థులకు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. సమేశ్వరరావు చేతుల మీదుగా... ఉపాధ్యాయుల సమక్షంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక్కో విద్యార్థి చేతిలో నిఘంటువు... ఒక్కో భవిష్యత్తుకు తాళం చెవి. నిఘంటువు అంటే కేవలం పుస్తకం కాదు... పదాలకు అర్థం...