సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..
డోర్నకల్లో లైవ్ వీక్షణ
డోర్నకల్, నవంబర్ 19. (ప్రజావాణి)
మహబూబాబాద్ జిల్లా
డోర్నకల్:సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభ కార్యక్రమాన్ని డోర్నకల్ పట్టణ ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
పట్టణంలోని గాంధీ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి సీఎం బహిరంగ సభను లైవ్లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు గాంధీ కూడలి వద్దకు చేరుకుని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు.
సిద్దిపేటలో జరుగుతున్న సభకు సంబంధించిన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడంతో గాంధీ కూడలి వద్ద సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కొండేటి రాజకుమారి హరిబాబు వైఎస్ మాద లావణ్య శ్రీనివాస్.మండల అధ్యక్షుడు శ్రీనివాస్ .పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్. వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు.మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వీరన్న.మాజీ వైఎస్ కోటిలింగం. వార్డు కౌన్సిలర్లు మల్లం ప్రవీణ అనిల్. హేమలత. ప్రమీల. రామకోటి. వీరన్న.తాళ్ళురి హనుమా. కో ఆప్షన్ ఖాదర్ బాబా. ఏపూరి కృష్ణ. మాజీ మార్కెట్ డైరెక్టర్ కాలా సుశీల్ కుమార్ జైన్. సర్పంచ్ రమేష్. మాజీ కోఆప్షన్ వాజిద్. మామిడి నాగరాజ్. దోమల లక్ష్మణ్. ఫరీద్. మధు. రామారావు. తదితరులు పాల్గొన్నారు

