📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

*వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి*

*జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ*

*బొక్కలగుట్టలో వరి పంట క్లస్టర్ క్షేత్ర ప్రదర్శన*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

రైతులు వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ తెలిపారు. జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం) పథకం కింద వరి పంట క్లస్టర్ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని బొక్కల గుట్ట గ్రామ శివారులో రైతు ధరావత్ రాజు వ్యవసాయ క్షేత్రంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ మాట్లాడుతూ, ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం పథకంలో భాగంగా వానాకాలం – 2026 సీజన్ లో నేరుగా వెదజల్లే సాగు పద్ధతి కింద కేఎన్ఎం -1638 వరి విత్తనాలను 50 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు వంద శాతం రాయితీపై పంపిణీ చేశామన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఆహార పంటల ఉత్పాదకత పెంచడం, నాణ్యమైన విత్తనాలు అందించడం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడమని తెలిపారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎన్ మహేశ్ మాట్లాడుతూ, కేఎన్ఎం – 1638 వరి వంగడం లక్షణాలు, అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సరైన సమయంలో నాట్లు, సమతుల్య ఎరువులు, నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. చీడపీడలను ముందస్తుగా గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ మాట్లాడుతూ, నేరుగా వెదజల్లే సాగు పద్ధతి ద్వారా నారుమడి పెంపకం, నారు పీకడం, నాట్లు వేయడం ఖర్చులు తగ్గడంతో పాటు కూలీల అవసరం, సాగు ఖర్చులు, నీటి వినియోగం ఆదా అవుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని జి కిరణ్మయి, మండల పంచాయతీ అధికారి మహేష్, గ్రామ సర్పంచ్ మాసు శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి సైండ్ల కనకరాజు, పంచాయతీ కార్యదర్శి అరుణ్ రాజ్, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.