📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

*ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

*ముధోల్‌లో ఘనంగా ఉక్కు మహిళ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 19:- భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం ముధోల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఆమె దేశానికి చేసిన సేవలను, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను స్మరించుకున్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం ద్వారా దేశ ఆర్థిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఇందిరా గాంధీ దేశ సమగ్రత, ఐక్యత, సార్వభౌమత్వం కోసం ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆమె నాయకత్వ పటిమ, సేవా దృక్పథం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఇందిరమ్మ ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిందే గజానంద్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండీ ఫరూక్ అహ్మద్, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, దేగాం గ్రామ వీడీసీ అధ్యక్షుడు నాని, మాజీ సర్పంచ్ దుప్పి గణేష్, మాజీ ఉపసర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు సుదర్శన్ గౌడ్, లక్కడి ఆనంద్, చోటు, సాయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చుండి రాజేశ్వర్, ఖాలిద్ ఖాన్, ఎస్.డి. అన్వర్, సోమాజి, అవినాష్, చందు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రటి కిష్టన్న, రమేష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.